పెద్దపల్లి, నిఘా న్యూస్:మంథని మున్సిపల్ పరిధి లోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈరోజు ఉదయం మంథని పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు.ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు మంత్రి శ్రీధర్ బాబు వద్దకు వచ్చి తన సమస్య తెలుపగా, వెంటనే ఆయన స్పందించి అవ్వా… అన్ని వేళలో నేను అండగా ఉంటానని, వృద్ధురాలికి మంత్రి శ్రీధర్ బాబు భరోసానిచ్చారు.
దీంతో వృద్ధురాలు మంత్రి శ్రీధర్ బాబు ను కొనియా డింది, శ్రీధర్ బాబు నా పెద్ద కొడుకని, ఏ సమస్య ఉన్న వెంటనే పరిష్కరిస్తారని, అంటూ మురిసిపోయింది..మంత్రి శ్రీధర్ బాబు ఆత్మీ యంగా పలకరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవ డంతో మంథని మున్సిపల్ పరిధిలోని ప్రజలు, హర్షం వ్యక్తం చేశారు..


