నీటి విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఆలువల కోటి కృతజ్ఞతలు….
గన్నేరువరం, మార్చి 29 (నిఘా న్యూస్): సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయని మండలంలోని పారువెల్ల గ్రామ రైతులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించి గాలి పెళ్లి నుండి పారువేళ్లకు నిరుపయోగంగా ఉన్న డి 4 కెనాల్ ను రెండు లక్షల నిధులతో మరమ్మత్తులు చేయించి నీటి విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కే డి సి సి బ్యాంకు డైరెక్టర్ ఆల్వాలకోటి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం గ్రామ రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు నాయకులు బోడా నరసింహ రెడ్డి, చెక్కిళ్ల తిరుపతి, చెన్నడి రాజిరెడ్డి, కట్ట కొమురయ్య, అరె ఎల్లయ్య, అంజయ్య మాట్లాడుతూ పంటలు ఎండకుండా నీటి విడుదలకు కృషి చేయించిన ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.