Sunday, August 3, 2025

విశాఖ – టూ- విజయవాడ కు త్వరలో మెట్రో!

అమరావతి, నిఘా న్యూస్: వి­శా­ఖ­ప­ట్నం, వి­జ­య­వాడ మె­ట్రో రైలు ప్రా­జె­క్టు­ల­పై కీ­ల­కం­గా ముం­ద­డు­గు పడిం­ది. ఏపీ మె­ట్రో రైల్ కా­ర్పొ­రే­ష­న్, సి­స్టా, టి­ప్సా కన్స­ల్టె­న్సీల మధ్య ని­ర్మా­ణం, పర్య­వే­క్షణ, సాం­కే­తిక సహ­కా­రం­పై ఒప్పం­దం జరి­గిం­ది. ఈ ఒప్పం­దం­పై మం­త్రి నా­రా­యణ సమ­క్షం­లో సం­త­కా­లు జరి­గా­యి. ఈ సం­ద­ర్భం­గా మం­త్రి నా­రా­యణ మా­ట్లా­డు­తూ..

రా­ష్ట్ర వి­భ­జన చట్టం ప్ర­కా­రం మె­ట్రో ని­ర్మా­ణం ప్ర­తి­పా­దిం­చా­మ­న్నా­రు. అయి­తే, గత ప్ర­భు­త్వం ప్రా­జె­క్టు­ల­ను ని­ర్ల­క్ష్యం­గా పక్కన పె­ట్టిం­ద­ని వి­మ­ర్శిం­ చా­రు. పె­రు­గు­తు­న్న ట్రా­ఫి­క్‌­కు మె­ట్రో రైలు ని­ర్మా­ణ­మే పరి­ష్కా­ర­మ­ని స్ప­ష్టం చే­శా­రు. కేం­ద్రం 20 శాతం, రా­ష్ట్రం 20 శాతం, మి­గి­లిన 60 శాతం అతి తక్కువ వడ్డీ లోన్ ద్వా­రా కేం­ద్రం నుం­చి అం­ద­ను­న్న­ద­న్నా­రు.

ఈ లో­న్‌­కు ఈఎం­ఐ­ల­ను మె­ట్రో కా­ర్పొ­రే­ష­న్ చె­ల్లిం­చ­నుం­ది నా­రా­యణ వె­ల్ల­డిం­చా­రు. విశాఖ మెట్రో ఫేజ్ 1..46 కిలోమీటర్లు వి­శాఖ మె­ట్రో ఫేజ్-1 కింద 46.23 కి­లో­మీ­ట­ర్ల మా­ర్గా­ని­కి రూ.11,498 కో­ట్ల అం­చ­నా వ్య­యం­తో ని­ర్మా­ణం చే­ప­డ­తా­మ­ని మం­త్రి నా­రా­యణ వె­ల్ల­డిం­చా­రు. వీ­ఎం­ఆ­ర్డీఏ 20 శాతం, కేం­ద్రం 20 శాతం, 60 శాతం లోన్ ద్వా­రా ని­ధుల సమీ­క­రణ జరు­గు­తుం­ద­ని తె­లి­పా­రు. ఇం­దు­కు సం­బం­ధిం­చి టెం­డ­ర్ల ప్ర­క్రియ ఇప్ప­టి­కే ప్రా­రం­భ­మైం­ద­ని నా­రా­యణ వె­ల్ల­డిం­చా­రు.

మరో­వై­పు, వి­జ­య­వాడ మె­ట్రో ఫేజ్-1 కింద 35.04 కి­లో­మీ­ట­ర్ల మేర ని­ర్మా­ణం చే­ప­డ­తా­మ­ని, రూ.10, 118 కో­ట్ల­తో అమలు చే­య­ను­న్న­ట్టు నా­రా­యణ తె­లి­పా­రు. సీ­ఆ­ర్డీఏ 20 శాతం, కేం­ద్రం 20 శాతం, 60 శాతం లోన్ ద్వా­రా ని­ధు­లు సమీ­క­రి­స్తా­మ­ న్నా­రు. వి­జ­య­వాడ మె­ట్రో­కు రేపు లేదా ఎల్లుం­డి టెం­డ­ర్లు పి­ల­వ­ను­న్న­ట్టు తె­లి­పా­రు.

ఈ రెం­డు మె­ట్రో ప్రా­జె­క్టు­ల­ ను మూ­డే­ళ్ల­లో పూ­ర్తి చే­య­డ­మే లక్ష్యం­గా ప్ర­భు­ త్వం వే­గం­గా ముం­దు­కు సా­గు­తోం­ద­న్నా­రు. అయి­తే, వి­శాఖ మె­ట్రో ప్రా­జె­క్టు­కు 99.75 ఎక­రా­లు, వి­జ­య­వాడ మె­ట్రో ప్రా­జె­క్టు కోసం 91 ఎక­రా­లు అవ­స­ర­మ­వు­తా­య­ని, భూ సే­క­ర­ణ­కు ఇప్ప­టి­కే నో­టి­ఫి­కే­ష­న్ జారీ చే­శా­మ­న్నా­రు మం­త్రి నా­రా­యణ.. ప్ర­జ­ల­కు అత్యా­ధు­నిక రవా­ణా సదు­పా­యా­లు అం­దిం­చ­డ­మే లక్ష్య­మ­ని స్ప­ష్టం చే­శా­రు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular