–ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్….
క్రీడల వల్ల మానసిక ఉల్లాశం, శరీరక దృఢత్వం లభిస్తుందనీప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయిన ప్రభుత్వ విప్ మాట్లాడారు. వేములవాడ పట్టణంలో బుధవారం ఎస్ ఆర్ ఆర్ ప్రీమియం లీగ్ సీజన్ 4 విజేత టీం సంతోష్ వారియర్స్ నిలువగా రన్నారప్ గా పండు లెవెన్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు..వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే జీవితంలో ఎంత పెద్ద ఇబ్బందులు ఎదురైన దృఢంగా ఉంటారని పేర్కొన్నారు.. క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనడానికి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించడం వల్ల ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.. త్వరలోనే మరిపెళ్లి గ్రామంలో క్రీడాకారులకు క్రీడా మైదానం అందుబాటులోకి తీసుకువస్తానని పేర్కొన్నారు.. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా పీడలపట్ల మక్కువ పెంచుకోవాలని అన్నారు..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని రానున్న ఒలంపిక్ పోటీల్లో పాల్గొనడానికి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం జరుగుతుందన్నారు.. సీఎం కప్ ద్వారా క్రీడాకారులను వెలికితీసి వారికి ప్రోత్సాహం అందించడం జరుగుతుందని తెలిపారు..
క్రీడలతో మానసిక ఉల్లాసం..
RELATED ARTICLES


