Sunday, August 31, 2025

ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలతో సమావేశం

వేములవాడ అక్టోబర్ 03 (నిఘా న్యూస్ ) నియోజక వర్గ ఓటర్ల జాబితా పునరేక్షణ రెవెన్యూ డివిజనల్ అధికారి, వేములవాడ శ్రీ S.రాజేశ్వర్ గారు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కి సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమును నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం-2025 లో భాగంగా ఇంటింటి సర్వే పూర్తి అయిందని తెలిపారు. అదే విధంగా సర్వేలో వచ్చిన Form-6, 7 & 8 ల వివరాలను గురించి చర్చించారు. మరణించిన ఓటర్ల, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు గురించి వివరించారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల లోకేషన్ ల మార్పిడి మరియు కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు.
అదేవిధంగా మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి శాసన మండలి పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ MLC స్థానాల ఎన్నికల కోసం ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని తేది:01.11.2024 నాటికి డిగ్రీ చదివి 3 సం. పూర్తి కాబడిన వారు Form-18 ద్వారా మరియు ఉపాద్యాయులు Form-19 ద్వారా ఓటరు నమోదుకై తేది:06.11.2024 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇట్టి సమావేశమునకు రాజకీయ పార్టీల ప్రతినిధులు P. నరేందర్ (BRS), v.హనుమండ్లు (BJP) రామస్వామి గౌడ్ (TDP), మరియు ఎలక్షన్ నాయబ్ తహసీల్దార్ B. శ్రవణ్ కుమార్ లు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular