జమ్మికుంట : ఫిబ్రవరి 11( నిఘా న్యూస్ ) జమ్మికుంట:ఈనెల 8 నుండి 11 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 5 వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన మాస్టర్స్ క్రీడా పోటీలలో జమ్మికుంట పట్టణానికి చెందిన ఎగిత అశోక్ 45+ వయస్సు విభాగంలో పాల్గొని హైమర్ త్రో లో మొదటి స్థానంలో బంగారు పతకం,జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) 45+ వయస్సు విభాగంలో పాల్గొని హైమర్ త్రో లో ద్వితీయ స్థానంలో వెండి పతకాలను ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ సెక్రెటరీ రామ్ పాల్ శర్మ, తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మా రెడ్డి, సెక్రెటరీ ప్రభు కుమార్ ల చేతుల మీదుగా అందుకున్నారు.అదే విధంగా తైవాన్ దేశంలో జరిగే అంతర్జాతీయ మాస్టర్స్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.వీరి ఎంపిక పట్ల ప్రజాప్రతి నిధులు అధికారులు కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులు, సబండ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు
RELATED ARTICLES