Sunday, August 3, 2025

బాణసంచా దుకాణాల ఏర్పాటు పేరిట భారీ దోపిడీ..

ఒక వ్యక్తి ఆధీనంలోనే మొత్తం స్థలం
దుకాణాల దారుల నుంచి అధికంగా వసూలు
తప్పక ఇస్తున్న వ్యాపారులు
ఆపై లబోదిబోమంటూ ఆవేదన

కరీంనగర్, నిఘా న్యూస్ : ‘సొమ్ము ఒకరిది.. సోకు మరొకరది..’ అనే సామెత వింటూ ఉంటాం. అలాగే ఒకరి పేరిట మరొకరు డబ్బును అక్రమంగా ఆర్జిస్తున్న విషయం కరీంనగర్ లో వెలుగు చూసింది. దీపావళి సందర్భంగా బాణ సంచా దుకాణాలు ఏర్పాటు చేస్తారు. అయితే వీటి ఏర్పాటు కోసం ఓ వ్యక్తి తక్కువ ధరకు స్థలాన్ని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకొని దుకాణాల దారుల నుంచి ఎక్కువ మొత్తంలో ఆర్జించి బాణసంచాను అమ్ముకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. సాధారణంగా బాణ సంచా దుకాణ దారులు ప్రభుత్వ అనుమతితో తక్కువ ధరకు ఈ స్థలాన్ని రెండు లేదా మూడు రోజుల పాటు లీజుకు తీసుకుంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. అసలేం జరిగిందంటే?

దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ పర్వదినం రోజున సాయంత్రం లక్ష్మీ పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఆ తరువాత బాణ సంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించుకుంటారు. దీపావళి రోజునే నరకచతుర్థి నిర్వహించుకుంటారు. ఈరోజున సత్యభామ నరకాసురుడిని సంహరించినందున ప్రజలు అప్పట్లో సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. ఇది క్రమంగా బాణ సంచాను కాల్చడం వరకు కొనసాగుతోంది. అయితే బాణ సంచాను కాల్చడం ఏడాదికేడాది పెరిగిపోతుంది. సామాన్యుల నుంచి ధనిక వర్గాల వరకు వారి స్థాయికి తగిన విధంగా బాణ సంచాను కొనుగోలు చేస్తారు. ఈ సందర్భంగా వీటి డిమాండ్ ను బట్టి ఆయా పట్టణాల్లో , నగరాల్లో బాణ సంచా దుకాణాలు వెలుస్తాయి.

దీపావళి సందర్భంగా బాణ సంచా దుకాణాలు ప్రత్యేకంగా వెలుస్తాయి. అయితే వీటి ఏర్పాటుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జనసంచారం లేని ప్రదేశాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అగ్ని ప్రమాదం వల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అయితే పట్టణాలు, నగరాల్లో మధ్యలో సరైన ప్రదేశాలు ఉండకపోవడంతో వల్ల వీటిని సిటీకి దూరంగా ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. అలాగే ప్లే గ్రౌండ్స్ ఉంటే వాటిలో నిర్వహించుకోవడానికి అవకాశం ఇస్తారు.

ఈ నేపథ్యంలో కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బాణ సంచా దుకాణాల ఏర్పాటు పేరిట కొందరు అక్రమంగా సంపాదిస్తున్నారు. అనుమతులు ఒకరు తీసుకొని మరొకరు అక్కడిన ప్రదేశాన్ని ఇష్టారాజ్యంగా విక్రయించుకుంటున్నారు. ఉదాహరణకు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో, మార్క్ ఫెడ్ గ్రౌండ్ లో బాణ సంచాల దుకాణాలు ఏర్పాటు చేశారు. సాధారణంగా వీటి ఏర్పాటుకు అగ్నిమాపక శాఖ తో పాటు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి. సరైన నిబంధనలు పాటిస్తూ పోలీసులకు దరఖాస్తు చేసిన తరువాత వారు అనుమతి ఇచ్చిన తరువాతే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి.

కానీ కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ఈ రెండు ప్రదేశాల్లోని దుకాణాలు ఏర్పాటులో ఓ వ్యక్తి భారీగా దోపీడీ చేసిటన్లు తెలుస్తోంది. కొందరు ప్రముఖులు ఈ ప్రదేశాలను తక్కువ ధరకు లీజుకు తీసుకున్నారు. ఆ తరువాత దుకాణదారుల నుంచి రూ. 30,000 వసూలు చేసి దుకాణాల ఏర్పాటు కోసం అవకాశం ఇచ్చారు. అంబేద్కర్ స్టేడియం స్థలాన్ని ఒకే వ్యక్తి రూ.5 వేలకు లీజుకు తీసుకొని ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారి నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో మార్క్ ఫెడ్ లోనూ జరిగినట్లు కొందరు దుకాణ దారులు పేర్కొంటున్నారు. అయితే కొందరు నేరుగా అనుమతి తీసుకోవాలని సంబంధిత శాఖ వారిని సంప్రదించగా.. ఆ వ్యక్తి లీజుకు తీసుకున్నారని చెప్పడంతో దుకాణదారులు అవాక్కయ్యారు. చేసేదీ ఏమీ లేక ఆ వ్యక్తికి ఒక్కొక్కరు రూ. 30 వేలు చేశారు. ఇలా అక్రమంగా వసూలు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular