కరీంనగర్, నిఘా న్యూస్: కరంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజేతగా నిలిచారు. 12, 959 ఓట్లతో ఆయన గెలుపొందారు. అయితే మొదటి నుంచి మల్క కొమురయ్య పేరు వినిపిస్తూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటిఫికేషన్ ప్రారంభం నుంచి ప్రచారం ముగిసే వరకు నిత్యం వార్తలను అందించిన ‘కలాం నిఘా’ మల్క కొమురయ్య విజయాన్ని అంచనావేసింది. కలాం నిఘా చెప్పిన విధంగానే విజేతగా మల్క కొమురయ్య నిలిచారు. ఇక పట్టభద్రుల ఓట్లు లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. పట్టభద్రుల ఎన్నికల లో భాగంగా ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ఓట్లను లెక్కించారు . ఇందులో సుమారు 21 వేల ఓట్లు( in valid )చెల్లుబాటు కాలేదు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు (valid )అయ్యాయి. ఇంకా 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు, విభజన చేయాల్సి ఉంది. ఉదయం 10 గంటల నుండి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేస్తారు.




