గార్ల సెప్టెంబర్ 20 (నిఘా న్యూస్):గార్ల మండల పరిధిలోని అంజనాపురం గ్రామానికి గుగులోత్ రాములు జూన్ నెల 7వ తారీఖున తన ఫోన్ పోయిందని గార్ల పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి పోయిన ఫోన్ను గుర్తించి శనివారం బాధితునికి ఎస్సై ఎస్ కే రియాజ్ పాషా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఎవరికైనా మొబైల్ఫోన్లు, ఇతర వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్స్టేషన్లో అప్పగించాలని, అంతే కాని వాటిని తమ వద్ద ఉంచుకోవడం నేరమని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.
పోగొట్టుకున్న సెల్ఫోన్ అప్పగింత
RELATED ARTICLES


