‘వెలమ’ కే మొగ్గు చూపిన ఏఐసీసీ, టీపీసీసీ
నేడు ప్రకటించే అవకాశం
కరీంనగర్, ఏప్రిల్ 02(నిఘ న్యూస్): కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బలమైన అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. కొద్దిరోజులుగా ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు తీవ్ర పోటీ నెలకొన్నది. దీంతో ఇక్కడ అభ్యర్థిని ఫైనల్ చేయడం కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. నిన్నటి వరకు నాన్చుకుంటు వచ్చిన కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని ఫైనల్ చేసినట్ల తెలుస్తున్నది. ఈ స్థానం నుంచి 12 మంది దరఖాస్తు చేసుకోగా తీవ్ర పోటీ నెలకింది. అయితే అనూహ్యంగా వెలిచాల రాజేందర్ రావు ను తమ అభ్యర్థిగా ఫైనల్ చేసినట్లు తెలుస్తున్నది. దీంతో ఆయన అనుచరుల్లో సంబరాలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ ఎంపీ స్థానానికి పార్టీలో పోటాపోటీ నెలకొంది. దీంతో ఈ స్థానంలో అభ్యర్థిని ఫైనల్ చేయడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు వినిపించినా ఫైనల్ గా వెలిచాలకే మొగ్గు చూపినట్లు సమాచారం.