కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ఉన్న పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలనలో భాగంగా , కరీంనగర్ త్రీ టౌన్ పరిధిలోని సుభాష్ నగర్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల, కరీంనగర్ వన్ టౌన్ పరిధిలో గల కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీంనగర్ టూ టౌన్ పరిధిలో సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతో పాటు పలు ఇతర పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి..
విధుల్లో ఉన్న సిబ్బందిని ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద సమస్యలు ఉన్నట్లయితే దృష్టికి తీసుకురావాలన్నారు. ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే అందుబాటులో వుండే సమీప అధికారులకు తెలియచేయాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద గుమిగూడుట ఎటువంటి అవాంఛానీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కరీంనగర్ సీపీ
RELATED ARTICLES