కరీంనగర్, నిఘా న్యూస్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల విషయంలో ‘కలాం నిఘా’ మీడియా ముందుగానే ప్రజాభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని చేసిన విశ్లేషణ పూర్తిగా నిజమైంది. స్థానిక సమస్యలు, అభివృద్ధి , నాయకుల ప్రవర్తన ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చేసిన అంచనాలు పోలింగ్ ఫలితాల్లో ప్రతిఫలించాయి.
నిజాయితీకి ప్రధాన ప్రాధాన్యం ఇచ్చే ఈ మీడియా సంస్థ గత కొన్ని నెలలుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న వినియోగ నీటి సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు, మంచిన ఆరోగ్య, రోడ్ల సదుపాయాల కొరత వంటి స్థానిక సమస్యలను నిరంతరం వెలుగులోకి తెచ్చింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్లక్ష్యం చేసే రాజకీయ నేతలపై కూడా సరైన సమయంలో విమర్శలు చేస్తూ మీడియా ప్రజల అభిరుచులు, వారి ఆందోళనలు ఎలా ఉంటాయో స్పష్టంగా చూపించింది.
జూబ్లీహిల్స్ ఫలితాలు తమ విశ్లేషణని సమర్థించాయి అని చెబుతూ ‘ప్రజల మాటే మా దారి. నిజాలను మాత్రమే ప్రసారం చేయడం మా విధానం’ అని కలం నిఘా మీడియా అధినేత చీకట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలకు అనుగుణంగా, వారి సమస్యల పరిష్కార దిశగా ముందుకు నడిచే వార్తలను అందించడం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతీ పాఠకునికి దగ్గరగా ఉంటూ, తక్షణం స్పందించే ప్రజామాధ్యమంగా కలం నిఘా కొనసాగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.


