Sunday, August 3, 2025

వచ్చే నెల 12 నుంచి ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు

అమరావతి, నిఘా న్యూస్ :మే 12 నుంచి 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్ష తేదీలను కూడా విడుదల చేసింది కూటమి సర్కార్,ఈరోజు నుంచి ఫీజులు చెల్లించవచ్చు. 22వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.త్వరలో సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ అందుబాటులోకి రానుంది. ఇంటర్ ఫస్టియర్ 70 శాతం మంది ఉత్తీర్ణత నమోదు కాగా.. ఇంటర్ సెకండ్ ఇయర్ 83 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫలితాలు విడుదల ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.

ఇంటర్ ఫస్టియర్ 70 శాతం మంది ఉత్తీర్ణత నమోదు కాగా.. ఇంటర్ సెకండ్ ఇయర్ 83 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా 93 శాతంతో మొదటి స్థానంలో ఉంది.అల్లూరి, అనకాపల్లి జిల్లాలు 73 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు హాజరయ్యారు.గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా ఏప్రిల్ 12న ఫలితాలను విడుదల చేయడం గమనార్హం.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular