కరీంనగర్, నిఘా న్యూస్: రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5 నుండి 9 వరకు ఈవీఎం యంత్రాల మొదటి స్థాయి తనిఖీ ( ఎఫ్ ఎల్ సి) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని ఈవియం గోడౌన్ లో ఈవిఎం మెషిన్ల లెవెల్ చెకింగ్ ప్రక్రియను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,లోకసభ 2024 సాదారణ ఎన్నికల కొరకు భారత ఎన్నికల సంఘం, న్యూడిల్లి సూచనలు మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, హైదరాబాద్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో జిల్లాలోని 2172 బియు లు, 1781 సియూ లు, 2124 వివి పాట్ లకు జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో మొదటి స్థాయి తనిఖీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, ఇంచార్జీ డిఆర్ఓ పవన్ కుమార్, తహసీల్దార్ రమేష్, సూపరింటెండెంట్ చరణ్, బిఎస్పి పార్టీ ప్రతినిధి గాలి అనీల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిమడుపు మోహన్, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిది సత్తినేని శ్రీనివాస్, బిజేపి పార్టీ ప్రతినిదితిరుమల్ రెడ్డి, ఎం ఐ ఎం అమీన్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య
పాల్గోన్నారు.
పారదర్శకంగా ఈవీఎం యంత్రాల తనిఖీ: కలెక్టర్
RELATED ARTICLES