కరీంనగర్, నిఘా న్యూస్: నిబంధనలకు విరుద్ధంగా కాకతీయ టెక్నో స్కూల్ అనే శీర్షిక తో గత రెండు రోజులుగా కలం నిఘా న్యూస్ దిన పత్రికలో ప్రచురించిన వార్తకు విద్యాశాఖ అధికారులు స్పందించారు,
“వివరాల్లోకి వెళితే”కరీంనగర్ పట్టణంలోని వావిలాల పల్లి లో చిన్న డబ్బా కొట్టు లాంటి బిల్డింగ్ లో కాకతీయ టెక్నో స్కూల్ ను సీతారాం రెడ్డి సొంత భవనంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ స్కూల్ ను వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ జార్జి రెడ్డి ఈ ప్రైవేట్ స్కూల్ ను నడిపిస్తున్నారు, విద్యాశాఖ అధికారి ఎంఈఓ మధుసూదనాచారి ఈ స్కూలును చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు, వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి ఇలాంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు, అందుకు వెంటనే స్పందించిన విద్య శాఖ అధికారులు బుధవారం కాకతీయ టెక్నో స్కూల్ ను సందర్శించి తనిఖీ చేశారు విద్యాశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ ను నడిపిస్తున్నారని స్కూల్ లో సరైన వసతులు లేవని చిన్న డబ్బా కొట్టు లాంటి స్కూల్ పిల్లలకు ఆట స్థలం లేకపోవడం నిబంధనకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యాశాఖ అధికారి తెలిపారు. అనంతరం కాకతీయ టెక్నో స్కూల్ యాజమాన్యానికి నోటీసులు అందజేశామని అన్నారు.
కాకతీయ టెక్నో స్కూల్ లో విద్యాశాఖ అధికారి తనిఖీ
RELATED ARTICLES