కరీంనగర్, నిఘా న్యూస్: 13వ డివిజన్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తేల్ల లక్ష్మీ–రమేష్ గారికి ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. పార్టీ టికెట్ అంశాలను పక్కనపెట్టి, ప్రజల నమ్మకమే అసలైన బలం అన్న నినాదంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు, డివిజన్ ప్రజలు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోయినా వెనుకడుగు వేయని తేల్ల లక్ష్మీ–రమేష్ గారు, ఆపిల్ గుర్తుతో ఎన్నికల బరిలో నిలిచి, గెలుపు దిశగా దూసుకుపోతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్ లెవల్‌లో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన అనుభవం ఉండటమే ఆయనకు ప్రధాన బలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
డివిజన్‌లో చేపట్టిన సేవా కార్యక్రమాలు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే స్వభావం కారణంగా, ఈసారి ఎన్నికల్లో గెలిచే అభ్యర్థిగా తేల్ల లక్ష్మీ–రమేష్ పేరు బలంగా వినిపిస్తోంది. పార్టీ రాజకీయాలకంటే అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించిన ఆయనకు యువతతో పాటు మహిళలు, వృద్ధులు సైతం మద్దతు తెలుపుతున్నారు.
“మన డివిజన్ – మన బాధ్యత” అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రచారం, 13వ డివిజన్‌లో కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.



