Thursday, March 5, 2026

మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో, ప్రత్యేక అధికారుల పాలన షురూ!

హైదరాబాద్, నిఘా న్యూస్:;రాష్ట్రంలోనే 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లు ఇక ప్రత్యేక పాలనలోకి వెళ్లాయి వీటి పదవి కాలం ఆదివారంతో ముగియడంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది, ఉమ్మడి జిల్లాలోని కార్పొ రేషన్‌, మున్సి పాలిటీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారు లను నియమించింది. నిజామాబాద్‌ నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మం తును నియమించగా, సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, ఇతర అధికారులు ప్రత్యేకాధికారి, కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. బోధన్‌ మున్సిపల్‌ అధికారిగా అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు అంకిత్‌ బాధ్యతలు స్వీకరించారు.

నిజామాబాద్‌లోని తన కార్యాలయంలో సంబం ధిత ఫైళ్లపై స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకాలు చేశారు. కామా రెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపల్‌ ప్రత్యేకాధికారి గా అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు.

ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పాలక పురపాలక పట్టణ అభివృద్ధి ముఖ్య కార్యదర్శి, దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular