కరీంనగర్, నిఘా న్యూస్: మట్టిగుట్టలు వరద కాలువ కరకట్టలను టార్గెట్గా సాగుతున్న ఈ దందా అధికారులకు కాసులవర్షం కురిపిస్తుండడంతో అడిగే వారే కరువయ్యారు. అడ్డగోలుగా అక్రమంగా తరలి స్తున్నా పట్టించుకునే వారు లేరని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అక్రమార్కులు మాత్రం అర్థరాత్రులు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ప్రశ్నించిన స్థానికులను అనుమతి ఉందంటూ అదరగొడుతున్నారు. రాత్రివేళల్లో జేసీబీ ద్వారా మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలిస్తు న్నారు. అర్ధరాత్రులు ట్రాక్టర్లు, టిప్పర్ల హరన్ మోతలతో పల్లెలు ప్రశాంతత కోల్పోతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదునుగా అక్రమార్కులు రూ.కోట్ల విలువచేసే మట్టిని ఖాళీ చేస్తున్నారు. అక్రమ మట్టి రవాణాను అడ్డుకునే అధికార యంత్రాంగమే లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నా పట్టించుకునే అధికారులే లేరా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గంగాధర మండలంలో వరద కాలువ పొడవునా ఉన్న కరకట్టలే టార్గెట్గా మట్టి అక్రమ దందా యథేచ్ఛగా సాగుతుంది. ఆచంపల్లి శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రిసమయంలో మట్టి మాఫియా అక్రమ రవాణాకు ఆద్యం పోస్తున్నారు. చూస్తే మట్టే కదా అనిపిస్తుంది. కానీ అది దొంగిలించే వాడికి కోట్లలో ఆదాయం తెచ్చిపెడు తుంది. ఇంత తతంగం నడుస్తున్నా గ్రామాల్లో విచ్చలవి డిగా మట్టి డంపులు దర్శనమిస్తున్నా అధికారులు పట్టిం చుకోకపోవడంతో ఈ అక్రమ మట్టి రవాణాపై ఏ శాఖ అధికారులు అడ్డుకట్ట వేయకపోవడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు మట్టి అక్రమ రవాణాపై రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖకు ఫిర్యాదులు చేసినా ఏ శాఖ అదికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలే అధికారులకు రూ.లక్షల్లో మామూళ్లు ముడుతున్నాయని ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. గత ప్రభుత్వంలో అదనపు టీఎంసీ వరద కాలువను ప్రారంభించి పనులు చేపట్టింది. ఇదే అదునుగా అక్రమ మట్టి వ్యాపారాలు రాత్రిపూట జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్లలో మట్టిని తర లిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ కాలువ మట్టిని యథేచ్చగా కొద్దిమంది కనుసైగల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీంతో కాలువలో పోయిన రైతుల భూముల పరిహారం కన్నా కాల్వకు పోసిన మట్టిని ఎత్తు కుపోయే వారికే రూ.కోట్ల ఆదాయం వస్తుందనే వాదన వినిపిస్తుంది.
అనమతి లేకుండా మట్టి అక్రమ రవాణా
RELATED ARTICLES