హైదరాబాద్, నిఘా న్యూస్:ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్ర పాలి కాట.. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోవడంతో ఆ స్థానాన్ని రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న ఇలంబర్తితో భర్తీ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం సాయంత్రం ఉత్తర్వులుజారీ చేశారు..
ఈ క్రమంలోనే పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్. శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా.. మహిళా సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా టీకే శ్రీదేవి.. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవోగా ఆర్వీ కర్ణన్.. ఆయుష్ డైరెక్టర్‌గా క్రిస్ట్రినాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్ రిలీవ్ అయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్‌లు సృజన, హరికిరణ్, శివశంకర్‌లు తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి రిపోర్ట్ చేశారు.ఈ క్రమంలోనే ఖాళీ అయిన స్థానాల్లో తాత్కాలికంగా ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించారు…


