హైదరాబాద్ , నిఘా న్యూస్: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా, పర్యాటక రంగాలను కొత్త దశకు తీసుకెళ్లే భారీ ప్రాజెక్టుగా భావిస్తున్న కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమ శిలను, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరును కలుపుతూ నిర్మించబోయే ఈ అత్యా ధునిక వంతెనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ అనుమతుల విషయంలో కూడా ముఖ్యమైన పురో గతి నమోదైంది. నేషనల్ హైవే-167కే విస్తరణ కోసం అవసరమైన అటవీ భూమిని మళ్లించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ స్టేజ్-1 అనుమతులను మంజూరు చేసింది. దీంతో ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం దిశగా ప్రక్రియ వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశంలోనే తొలి కేబుల్ స్టేడ్-కమ్-సస్పెన్షన్ బ్రిడ్జి రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ వంతెన ప్రత్యేకత ఏమిటంటే ఇది దేశంలోనే మొదటి కేబుల్ స్టేడ్-కమ్-సస్పెన్షన్ బ్రిడ్జిగా నిలవనుంది. ఆధునిక ఇంజినీరింగ్ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబోయే ఈ వంతెన నిర్మాణం పూర్తయితే అది కేవలం రవాణా మార్గమే కాకుండా ఒక పర్యాటక ఆకర్షణగా కూడా మారే అవకాశముంది.
ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో కనిపించే ఐకానిక్ బ్రిడ్జిల మాదిరిగా దీన్ని రూపొందించేలా ప్రణాళి కలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అటవీ అనుమతులకు కీలక సమావేశం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ అనుమతులపై చెన్నైలోని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఇటీవల కీలక సమావేశం జరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో జరిగిన ఈ సమావేశంలో స్టేజ్-1 అటవీ అనుమ తులను కొన్ని షరతులతో మంజూరు చేశారు.
అటవీ భూమిని రహదారి విస్తరణ కోసం ఉపయోగిం చాల్సి ఉండటంతో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు నిబంధనలు విధించారు. అటవీ శాఖ అధిపతి డాక్టర్ సి. సువర్ణ మాట్లాడుతూ అటవీ భూమి వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం కలగకుండా చర్యలు తీసు కోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా అక్కడ సంచరించే వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళి కలు రూపొందించాలని సూచించారు.
అడవిలోని జీవవ్యవస్థను కాపాడే విధంగా నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పారు. అటవీ భూమిని రహదారి నిర్మాణానికి వినియోగిస్తున్నందున మరో ప్రాంతంలో మొక్కలు నాటి కొత్త అటవీ ప్రాంతా న్ని అభివృద్ధి చేయాలని కూడా కేంద్రం సూచించింది. దీనిని కంపెన్సేటరీ అఫారెస్టేష న్”గా పిలుస్తారు. అలాగే అటవీ భూమి మళ్లింపుకు సంబంధించిన నెట్ ప్రెజెంట్ వాల్యూ రూపం లో ప్రభుత్వానికి నిధులు చెల్లించాలని కూడా పేర్కొన్నారు.
ఈ నిధులను అటవీ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ షరతులను పూర్తిగా అమలు చేస్తే స్టేజ్-2 అటవీ అనుమతులు మంజూరు అవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియలో ఏజెన్సీతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసినట్లు డాక్టర్ సువర్ణ తెలిపారు. ప్రయాణికులకు భారీ లాభం ఈ వంతెన నిర్మాణం పూర్తయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా వ్యవస్థలో పెద్ద మార్పు వస్తుంది.
ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దూరం సుమారు 80 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం చేయాలంటే చాలా పొడవైన మార్గాన్ని ఉపయోగించాల్సి వస్తోంది. కొత్త వంతెన వల్ల ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. ఇది కేవలం ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల మధ్య ఆర్థిక మరియు సామాజిక అనుసంధా నాన్ని కూడా బలోపేతం చేయనుంది.
పర్యాటక రంగానికి ఊతం ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పర్యాటక రంగానికి భారీ ప్రోత్సాహం లభించనుంది. నల్లమల అడవులు, శ్రీశైలం బ్యాక్‌వాటర్స్, సోమశిల సిద్ధేశ్వర ఆలయం వంటి ప్రాంతాలు ఇప్పటికే ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందాయి. కొత్త వంతెనతో ఈ ప్రాంతాలకు పర్యాట కుల రాకపోకలు మరింత పెరిగే అవకాశముంది.
ప్రత్యేకంగా వంతెనపై ఏర్పాటు చేసే వ్యూ పాయింట్లు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కృష్ణా నది మధ్యలో విస్తరించిన నీటి విస్తీర్ణం, చుట్టూ నల్ల మల అడవుల అందాలు ఈ వ్యూ పాయింట్ల నుంచి చూడగలిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


