పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేస్తాం.
.
జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి,
జమ్మికుంట : మార్చి 30( నిఘా న్యూస్ ):జమ్మికుంట :శనివారం హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజక ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశిని స్వప్న-కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తాను 1995నుండి కాంగ్రెస్ పార్టీ కార్య కర్తగా పని చేశానని, ఎన్ ఎస్ యూఐ మండల అధ్యక్షుడిగా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా, ఇళ్ళందకుంట ఆలయ చైర్మన్ గా ఉమ్మడి జమ్మికుంట మండలానికి జెడ్పిసిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పని చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి తనకు అండగా నిలిచిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ ని చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ వీడాల్సి వచ్చిందన్నారు. కాని మళ్లీ కాంగ్రెస్ కండువ మెడలో వేసుకున్న తర్వాత తనకు గొప్ప అనుభూతి కలిగిందన్నారు. 23సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో చేసానని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వొడితల ప్రణవ్ బాబు నాయకత్వంలో పార్టీ కోసం పని చేస్తామన్నారు.