Thursday, February 6, 2025

రాజకీయ పార్టీల కు గుబులు పుట్టిస్తున్న బిసిల ఐక్యత రాగం

కరీంనగర్:మారిపోయిన ఏం ఎల్ సి ఎన్నికల పరిస్థితి ఎప్పటిలాగే కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేయడంతో బీసీ సామాజిక వర్గ నేతలకు చుక్కెదురైనట్లు ఐనది ఈ సారైనా బడుగు బలహీనర్గాలకు ఏం ఎల్ సి పీఠం దక్కుతుందనే ఆశావహుల కు నిరాశే మిగిలినట్లైనదని అనుకుంటున్నారు పట్టభద్రులు ఏది ఏమైనా బీసీ గళం కరీంనగర్ గడ్డ మీద ఎక్కువగా వినిపిస్తోంది రాజకీయ పార్టీలు ఎప్పుడు ఉన్నత సామాజిక వర్గాలకే అవకాశం ఇస్తుండటంతో ఈసారి బీసీ ల నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు బీసీ పట్టభద్రులు అంత ఒక్కటై స్వతంత్ర అభ్యర్థి నీ బరిలో దింపితే రాజకీయ పార్టీలు గట్టి పోటీ ఎదుర్కోక తప్పదని అనుకొంటున్నారు ఏం ఎల్ సి ఎన్నికల పోరులో రెడ్డి సామాజిక వర్గం ఇటు బీసీ సామాజిక వర్గం డి అంటే డి అనే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తుంది దన బలం ఎక్కువ ఉన్న ప్రజాబలం కూడగట్టని పరిస్థితులు ఏం ఎల్ సి అభ్యర్థులు సవాలుగా తీసుకుంటేనే విజయం సాధిస్తారని పట్టభద్రుల సమస్యలు తీరాలంటే సామాజిక న్యాయం జరగాలంటే వెనుక బడిన కులాలు ఒక్కటై బీసీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే రాజకీయ పార్టీల కు వెనుక బడిన సామాజిక వర్గం దూరం కాక తప్పదనే అంటున్నారు బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద ఫైర్ అయిన బీసీ నేతలు ఒక పక్క బిసిల కోసమే బీసీ కులగణన అనిచెప్పి అందరికీ సమ న్యాయం చేస్తామని ఎన్నో మాటలు ఇప్పుడు ఎటుపోయాయని రెడ్డి సామాజిక వర్గానికి ఏం ఎల్ సి టికెట్ ఇవ్వడానికి కారణం ఏమిటో చెప్పాలని ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటని ఫైర్ అయ్యారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానానికి అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డిని ఎంపిక చేయడం వ్యతిరేకిస్తున్నామని బీసీ సంఘాలు సైతం తెలియజేశారు ఈ కాంగ్రెస్ పార్టీ రెడ్ల కాంగ్రెస్ పార్టీ గా నిరూపణ అయ్యిందని ఇప్పుడు రాహుల్ కాంగ్రెస్ కాదని గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు కేటాయిస్తామని చివరకు అందరికంటే తక్కువ సీట్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికల్లో మా బిసిల పవర్ ఎంటో తెలుస్తుందని బిసి సంఘాలు అంటున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular