హైదరాబాద్, నిఘా న్యూస్: టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయనకు వారం రోజుల క్రితం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ విషయం పాఠకులకు తెలిసిందే అయితే, ఆ నోటీ సులలో ఇవాళ బషీర్‌బాగ్ లోని ఈడీ కార్యాలయానికి ఉదయం 10.30కి విచార ణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ మహేశ్ బాబు విచారణకు హాజరవుతారా..? లేదా? అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా, సురానా గ్రూప్,ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను చెక్కు రూపంలో రూ.3.4 కోట్ల, లిక్విడ్ క్యాష్ రూ.2.5 కోట్లు అంటే మొ త్తం రూ.5.90 కోట్ల పారితో షికం తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు.
ఈ మేరకు మనీ ల్యాండరిం గ్ కు పాల్పడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలను ఇన్‌ఫ్లుయెన్స్ చేశారని, ప్రమోషన్స్ పేరుతో వారి నుంచి భారీగా పారితోషికం తీసుకున్నారనే అభియోగాల మేరకు ఈ నెల 22న మహేశ్ బాబుకు నోటీసులు జారీ అయ్యాయి.