Friday, February 27, 2026

నేటి నుండి మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు!

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు .. ఈనెల 28, 29, 30, 31, తేదీల్లో మహా జాతర జరగనుండగా.. భక్తులకు సౌకర్యనార్థం హన్మకొండ, నుంచి మేడారం వరకు పది రోజులపాటు.. హెలిక్యాప్టర్ సేవలు భక్తులకు అందు బాటులో ఉంటాయని టూరిజం శాఖకు చెందిన అధికారులు తెలిపారు.

ఈ మేరకు తెలంగాణ టూరిజం శాఖ మేడారంలో భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది, హనుమకొండ నుండి మేడారం వచ్చే భక్తులకు ఒక్కొక్కరికి 35 వేల 999 రూపాయలు వసూల్ చేస్తారు. ఇందు కోసం మేడారంలోని పడి గాపూర్, దగ్గర హెలిప్యాడ్, ఏర్పాటు చేశారు.మేడారం ఏరియల్ “వ్యూ” వీక్షించేందుకు హెలికాప్టర్ సేవలు అందు బాటులో ఉంటాయని టూరిజం శాఖ తెలిపింది, టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను మంత్రి సీతక్క గురువారం ప్రారంభించనున్నారు.

కాగా విహంగ వీక్షణ జాయ్ రైడ్స్ కు ఒక్కరికి 4,800 రూపాయలు చార్జితో ఏడు నిమిషాలు హెలికాప్టర్లో ఏరియల్ “వ్యూ” వీక్షించేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular