హైదరాబాద్, నిఘాన్యూస్:హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం పడుతోంది. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారా యణ గూడ, లక్డీకాపుల్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరుతో వాహనదారులు, బాట సారులు ఇబ్బందులు పడ్డారు.
పలు చోట్ల ఈదురు గాలు లకు చెట్లు నెలకొరిగాయి. దీంతో ట్రాఫిక్కు అంతరా యం ఏర్పడింది. ఖైరతా బాద్ మెర్క్యూర్ హోటల్ ఎదుట చెట్టు కూలి కారుపై పడింది. సాయంత్రం ఐదు గంటల వరకు ఏకధాటిగా వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ట్రాఫిక్ అంతరాయం సికిం ద్రాబాద్ పరిసర ప్రాంతాల లో వర్షం కురుస్తుంది. వేసవి తాపానికి ఇబ్బం దులు ఎదుర్కొంటున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. తిరుమలగిరి, బోయిన్ పల్లి, అల్వాల్, మారేడుపల్లి చిలకలగూడ ప్యాట్నీ ప్యారడైస్ ప్రాంతాలలో వర్షం కురుస్తుంది.
ఒక్కసారిగా కురుస్తున్న వర్షానికి రహదారులన్ని జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపోవడంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.