Sunday, August 31, 2025

హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన

హైదరాబాద్, నిఘా న్యూస్:హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కొద్ది సేపటి క్రితం వర్షం దంచి కొట్టింది, దీంతో వరద నీటితో రహదారు లన్నీ, జలమయం అయ్యాయి, లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముద్దయ్యిం ది. అటు తెలంగాణలో మూడు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరా బాద్ లోని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి తీవ్ర టాపిక్ జామ్ ఏర్పడింది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, మాదాపూర్, కూకట్ పల్లి, సూచిత్ర ఏరియాల్లో కుండపోత వర్షం కురిసింది.

తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. చక్రవాతపు ఆవర్తనం ఒకటి దక్షిణ ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీక్రుతమైందని తెలిపింది.దీంతో తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular