Health Tips: ఇంగువ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇంగువను ఉపయోగించడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు .ఇంగువ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు సహాయపడుతుంది. తామర, గజ్జి, మొటిమలు వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో ఇంగువను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంగువ తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం కూడా మెరుగుపడుతోంది. దీనిని తరచూ తీసుకోవడం వలన స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. ఇంకా ఇంగువ యాంటీ మైక్రోబాయో లక్షణాలను కూడా కలిగే ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా వైరస్ వల్ల కలిగే నష్టా కలిగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాము. ఇంగువను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్తపోటు స్థాయిలో అదుపులో అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.