Wednesday, March 4, 2026

చిద్రమవుతున్న చేనేత బతుకులు..

కరుణ చూపని కాంగ్రెస్ ప్రభుత్వం..

సిరిసిల్ల ఆగస్టు 28( నిఘ న్యూస్) ఒక బాధిత కూతురి హృదయం మీ ముందుకు తీసుకు వస్తున్నాను. సిరిసిల్లలోని ఒక సాధారణ మధ్యతరగతి ఆ స్వామి కుటుంబంలో జన్మించి పవర్ లూమ్స్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. కానీ గత తొమ్మిది నెలలుగా మా కుటుంబం పాడైపోయింది.మా తండ్రికి పని లేక మా ఇంట్లోనూ వెలుగులు కనిపించడం లేదు పని లేకపోవడం వల్ల మా తండ్రి తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. అప్పులు ఇచ్చిన వ్యక్తులు మా ఇంటికి వచ్చి మా తండ్రి మీద ఒత్తిడి పెంచుతూ కరుణ లేకుండానే అవమానిస్తునే ఉన్నారు.నిత్యవసర వస్తువులకోసం కూడా డబ్బులు లేక మా కుటుంబం ఆకలి బాధలో నడుస్తోంది. నేను ఇంజనీరింగ్ విద్యార్థిని మా తల్లిదండ్రులు నా చదువు కోసం అన్ని త్యాగాలు చేశారు. కానీ ఇప్పుడు ఫీజులు చెల్లించడానికి మా వద్ద డబ్బు లేకపోవడం వలన నా చదువు ఆగిపోవచ్చు ఈ ఆలోచన మా తల్లిదండ్రుల్ని మరింత బాధ పెడుతోంది. ఇంతకాలం మా తండ్రి ఎప్పుడు మాకు అవసరమైనది అందించేవారు కానీ ఇప్పుడు నేను ఏదైనా అడగడానికి కూడాభయపడుతున్నాను.ఈ కష్టం నాది మాత్రమే కాదు సిరిసిల్లలోని అనేక కుటుంబాలు ఈబారం భరిస్తున్నాయి. మా గ్రామం మొత్తం నిరాశతో నిండిపోయింది. ఇలాంటి సమయంలో మా ఎమ్మెల్యే కేటీఆర్ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారం చూపించాలని ఆర్థిగా కోరుతున్నాను.మీరు చర్యలు తీసుకోకపోతే అనేక కుటుంబాలు ఈ దుస్థితి నుండి బయటపడలేని పరిస్థితి లోకి వెళ్లిపోతాయి. ప్రభుత్వాలు స్పందించి మా బాధలను అర్థం చేసుకొని చేనేతలకు చేయూతను ఇచ్చి వారి బతుకులలో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular