రాజన్న సిరిసిల్ల జిల్లా, నిఘా న్యూస్:- వేములవాడ గత 8 నెలలుగా కిరాయి చెల్లించడం లేదని గురుకుల పాఠశాలకు భవన యజమాని తాళం వేసిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్ లో గత ఐదు సంవత్సరాలుగా గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నారు. తాజాగా, 8 నెలల నుండి డబ్బులు రాలేదని, ఇప్పటివరకు 14 లక్షల 80 వేల రూపాయలు తమకు ప్రభుత్వ నుండి రావాల్సిన కిరాయి డబ్బులు రాకపోవడంతో విసిగిపోయిన భవన యజమాని ఈరోజు ఉదయం పాఠశాలకు తాళం వేశాడు. వెంటనే ప్రిన్సిపాల్ భవన యజమానితో మాట్లాడి డబ్బులు త్వరగా వచ్చే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో, తాళం తీయడంతో విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, యజమానికి రావలసిన డబ్బులు ప్రభుత్వ ఫైనాన్స్ విభాగం వద్ద పెండింగ్ లో ఉందని త్వరగా డబ్బులు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.
అద్దె చెల్లించ లేదని గురుకుల పాఠశాల కు తాళం
RELATED ARTICLES


