Monday, January 27, 2025

‘వెలిచాల’కు పెరుగుతున్న మద్దతు..

అయనకే టికెట్ కేటాయించాలని డిమాండ్
కచ్చితంగా గెలిపించుకుంటామని శపథం
తీన్మార్ మల్లన్నకు ఇస్తే ఓడిపోవడం ఖాయం అంటున్న పార్టీ శ్రేణులు

కరీంనగర్, నిఘా న్యూస్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తోంది. తెలంగాణలోనూ చాలా చోట్ల క్యాండిటేట్లను నిలబెట్టింది. కానీ రాష్ట్రంలో కీలకంగా ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని మాత్రం పెండింగులో ఉంచింది. ఇప్పటి వరకు 6 జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్.. ఇప్పటికీ కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియక పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, ప్రవీణ్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నాయి. అయితే సామాజిక సమీకరణలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో బీసీ నేతను బరిలోకి దింపుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరు తాజాగా వినిస్తోంది. అయితే తీన్మార్ మల్లన్న పేరు వినిపించడంతో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రస్ కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ లోక్ సభ స్థానంలో ఎక్కువ సార్లు కాంగ్రెస్ విజేతగా నిలిచింది. నియోజకవర్గం ఏర్పడిన తరువాత 1957లో మొదటిసారిగా ఎంఆర్ కృష్ణ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తరువాత ఎం శ్రీరంగారావు, జువ్వాడి రమాపతి రావు, ఎం సత్యనారాయణ రావు, జువ్వాడి చొక్కారావు గెలిచారు. 2009లో ఇప్పటి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ అప్పడు ఎంపీగా గెలిచి పార్లమెంట్ కు వెళ్లారు. అప్పటి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి చూస్తే ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారని తెలుస్తోంది.

కరీంనగర్ లోక సభ పరిధిలో కాంగ్రెస్ ను ఆదరించడంతో పాటు వెలమ అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. నాటి శ్రీరంగారావు నుంచి ఎం. సత్యానారాయణ రావు వరు అందరూ వెలమ వర్గానికి చెందిన వారే. అటు బీజేపీ నుంచి విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ ఈ వర్గానికే చెందిన వారు కావడంతో కరీంనగర్ వెలమకోటగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇదే కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ బీసీ నుంచి గెలుపొందారు. ఆ తరువాత బీజేపీ నుంచి బండి సంజయ్ గెలుపొందారు. మొత్తంగా చూస్తే వెలమ వర్గానికే ఎక్కువ ప్రిపరెన్స్ ఇచ్చారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వెలమ వర్గానికి చెందిన వెలిచాల రాజేందర్ రావు పేరు ప్రతిపాదన రాగానే కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. ఆయన పేరు ప్రకటిస్తే గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాలని పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. అయితే పొన్నం ప్రభాకర్ కు హుస్నాబాద్ అసెంబ్లీ సీటు కేటాయించిన నేపథ్యంలో అప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రవీణ్ రెడ్డికి కరీంనగర్ లోక్ సభ సీటు కేటాయిస్తారని అంటున్నారు.

తాజాగా బీసీ అభ్యర్థికే కేటాయిస్తారని, అందులోనూ తీన్మార్ మల్లన్నకు ఇవ్వాలని అధిష్టానం చూస్తోందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంతో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటోంది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి లోక్ సభ స్థానాల్లో ఎక్కువగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారినే ఆదరించారు. దీంతో లోకల్ క్యాండిడేట్లను ప్రకటించాలని కోరుతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పేరు ప్రకటించగానే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నాన్ లోకల్ అభ్యర్థి అంటూ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పేరు ప్రకటిస్తే నాన్ లోకల్ ముద్ర పడి ఓడిపోవడం ఖాయం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ కు ఆదరణ
సరిళ్ల రతన్ రాజు, కాంగ్రెస్ నగర ప్రధాన కార్యదర్శి, కరీంనగర్.

పదేళ్ల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే తెలంగాణ వ్యాప్తంగా పార్టీ విస్తరిస్తోంది. ఈ తరుణంలో కరీంనగర్ లోక్ సభ పరిధిలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ వెలమ కోటగా ఉన్న కరీంనగర్ లో ఆ వర్గానికే సీటు కేటాయిస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి.

వెలిచాల రాజేందర్ రావుకు గ్రామగ్రామాన ఆదరణ
గండి రాజేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్.

కాంగ్రెస్ నుంచి టికెట్ కోరుతున్న వెలిచాల రాజేందర్ రావుకు గ్రామగ్రామన కార్యకర్తలు ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రజల్లోకి వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్నారు. తండ్రి బాటలోనే కరీంనగర్ పై పట్టు సాధించిన రాజేందర్ రావు ఎంపీగా గెలిస్తే ఢిల్లీ నుంచి ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఉంది. అందువల్ల వెలిచాల రాజేందర్ రావుకు టికెట్ కేటాయించాలి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular