కరీంనగర్, నిఘా న్యూస్: ఆదిలాబాద్- నిజామాబాద్ మెదక్ కరీంనగర్ టీచర్ MLC అభ్యర్థిగా బిజెపి తరఫున బరిలో ఉన్న ముల్క కొమురయ్యకు మద్దతు రోజురోజుకు పెరిగిపోతుంది. ఈయన పోటీ చేస్తున్న నాలుగు జిల్లాల పరిధిలోనే ఆ పార్టీ ఎంపీలు నలుగురు ఉన్నారు. మొత్తం 8 నుంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఏ జిల్లాలకు చెందిన వారే కావడం ప్లస్ పాయింట్ గా మారింది. అంతేకాకుండా కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ ముల్క కొమరయ్యకు పూర్తి అండదండలు ఉన్నాయి. మెదక్ ఎంపీ రఘునందన రావ్ రూపంలో బలమైన మద్దతు ఉండడంతో ఆయన గెలుపు ఖాయమని పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపుఆదిలాబాద్ గిరిజనులంతా కాషాయ పార్టీ వైపునే ఉండడంతో ఈయన గెలుపు సునాయాసమేనని చర్చించుకుంటున్నారు.
ఉత్తర తెలంగాణలో బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కొమరయ్యకు తపస్, ఆర్ఎస్ఎస్ వంటి సంఘాలు తోడ్పాటు ఉన్నాయి. ఇప్పటికే నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటుతో అక్కడి రైతులు బిజెపికే పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి అసాధారణ ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న ఈయన పుట్టిన ప్రాంతాన్ని మరవకుండా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. చదువుతోనే మనిషికి విలువ ఉంటుందని గుర్తించి చదువు వైపు యువత వెళ్లేలా కృషి చేసిన ముల్క కొమురయ్యకు యువత అండదండలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.
కొమరయ్య ప్రస్తుత పెద్దపెల్లి జిల్లాకు చెందిన వారు. 1950 లో ఈ జిల్లాలోని అప్పన్నపేటలో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన ఇంటర్ వరకు కరీంనగర్లో చదివారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మన సందర్భంగా మాట్లాడుతూ కొన్ని హామీలను ఇచ్చారు.
సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన 57 జీవో ప్రకారం 2003 డీఎస్సీ వారికి పెన్షన్ హామీ అమలయ్యేలా చూస్తా అని అంటున్నారు.సమగ్ర శిక్షలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న సీఆర్టీలను రెగ్యులరైజ్ చేయడం, వారికి పి స్కేలు, ఆరోగ్య భద్రత లాంటి సౌకర్యాల అమలు కోసం కృషి చేస్తా అని పేర్కొంటున్నారు. KGBV టీచర్ల సమాన పనికి సమాన వేతనం డిమాండ్స్ పై ప్రభుత్వంలో కొట్లాడుతా అని హామీ ఇస్తున్నారు.మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్ధతి ద్వారా వేతనాలు చెల్లించలా. ఇతర టెనిఫిట్స్ కోసం ప్రయత్నం చేస్తా నరి చెబుతున్నారు.మెడికల్ రీయింబర్స్ మెంట్ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, ఫ్యామిలీకి ఒకే హెల్త్ కార్డు ఉండేలా కార్పొరేట్ హాస్పిటల్ సహా అన్నింటిలో క్యాష్ లేస్ వైద్యం పొందేలా టీచర్లందరికీ హెల్త్ కార్డులు సాధించే విధంగా కృషి చేస్తా అని హామీలు ఇస్తున్నారు.టీచర్ల సమస్యలపై పోరాడి..వారి గొంతుకను మండలిలో వినిపించేందుకు వస్తున్న, ఉద్యోగ, ఉపాధ్యాయ బంధువులారా నన్ను ఎమ్మెల్సీగా ఆశీర్వదించి, పెద్దల సభకు సంపండి. మీ సేవకుడిగా పని చేస్తా నాని ముల్క కొమురయ్య పేర్కొంటున్నారు.