కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్ లోని వీ కన్వెన్షన్ హల్లో ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వేలాదిమంది గీతా కార్మికులు, సంఘం సభ్యులు తరలివచ్చారు. ఆదర్శ ఎండీ బూరుగు సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి రాజేశం గౌడ్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, నాయకులు పల్లె లక్ష్మణ్ గౌడ్, రాచకొండ తిరుపతి గౌడ్, రిటైర్డ్ డిసిపి సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్ చక్రధర్ గౌడ్, పొన్నం సత్యం, సుధ గోని లక్ష్మీనారాయణ గౌడ్, పొన్నం శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాచర్ల అంజయ్య, మాచర్ల ప్రసాద్, కోట రవి, దేశిని కోటి, వివిధ జిల్లాల నాయకులు, ప్రతినిధులు గీతా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఘన సన్మానం
RELATED ARTICLES