కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలి
ఫిబ్రవరి 16 తేదీన దేశవ్యాప్త కార్మిక సమ్మె
సంతకాల సేకరణ
CITU జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్…
సంగారెడ్డి ప్రతినిధి (నిఘా న్యూస్): సదాశివపేట పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26 వేల రూపాయల చెల్లించాలని గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కేంద్ర ప్రభుత్వ మూలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని ఈ నెల 16వ తారీఖు న దేశవ్యాప్త కార్మికుల సమ్మె జయప్రదం చేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం నాడు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించి , కార్మికుల దగ్గర నుంచి సంతకాలు సేకరించడం జరిగింది
ఈ సందర్భంగా వి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంతకాలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. గ్రామపంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పర్మనెంట్ కావడం లేదు, కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయిన కార్మికుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేటు వారికి అప్పచెబుతుంది అన్నారు కార్మిక చట్టాలను మొత్తం మార్చేసింది, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పై ఫిబ్రవరి 16వ తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి దశరథ్ యూనియన్ నాయకులు శేఖర్ సంజీవులు, నగేష్ కుమార్ మహిపాల్ అశోక్ ,రామచందర్, మాణిక్యం యాదమ్మ తదితరులు పాల్గొన్నారు