అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్
రైతులకు అవసరమైన టార్పలీన్ కవర్లు అందుబాటులో ఉంచాలి
పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 22 (నిఘా న్యూస్): సోమవారం నాడు పెద్దపల్లి సుల్తానాబాద్ మార్కెట్ యార్డులలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు సకాలంలో కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకుఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి సీజన్ కు సంబంధించి నాణ్యమైన ధాన్యాన్ని చివరిగింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. నాణ్యత ప్రమాణాల దృష్ట్యా తేమశాతం వచ్చిన త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలనిసూచించారు.అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లర్ల వరకు తరలించాలన్నారు మిల్లుల వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవకతకు జరిగినట్టు తేలితే చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు ధాన్యం విరివారాలు ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు