Wednesday, March 4, 2026

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

యాదాద్రి జిల్లా, నిఘా న్యూస్: తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఈరోజు ఉదయం దర్శించు కున్నారు.ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌.. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆ తర్వాత పండితులు వేదాశీర్వచనం పలికారు. గవర్నర్‌ను శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం దాతల నుంచి విరాళాల సేకరణకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని గవర్నర్‌ ప్రారంభించారు.రాష్ట్ర గవర్నర్‌గా బాధ్య తలు చేపట్టిన తర్వాత జిష్ణుదేవ్‌ వర్మ యాదాద్రికి వెళ్లడం ఇదే తొలిసారి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular