కరీంనగర్, నిఘా న్యూస్:విద్యార్థులకు సామాజిక అవగహాన చాలా కీలకమని మరియు వారికి పలు పోటీ పరీక్షలలో జయకేతనం ఎగురవేయడానికై ఎంతగానో దోహాదపడుతుందని మరియ అగ్రగామిగా ఉండానిటానికై చేయాతనిస్తూందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి గారు స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు సిల్వర్ జోన్ వారు నిర్వహించిన జి.కె. ఒలంపియాడ్లో అత్యుత్తమ ఫలితాలతోపాటు బంగారు పతకాలు సాధించిన సందర్భంగా ఏర్పాటుచేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనరల్ నాలెడ్జ్ అనేక విషయాలను ఉన్నాయని మరియు ఆ విషయాల పట్ల పట్టు సాధిస్తే ఘనవిజయాలను నమోదు చేయవచ్చని అభిప్రాయపడుతు ప్రతి ఒక్కరు జికెలో తెలుపబడిన నిబంద్దనలను పాటించి ముందంజలో ఉండడమే కాకుండా ఘనవిజయాల వైపు పయనించాలని వారు ఆకాక్షించారు.
పాఠశాల స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులను వివిధ స్థాయిలలో మరియు సంస్థల వారు నిర్వహిస్తున్న పలు పోటీ పరిక్షలకు ఎంపికచేయడం జరుగుతుందని అభిప్రాయపడుతు ప్రతిఒక్కరు అన్ని విధాలుగా అంశాలను సాధన చేసి పట్టు సాధించి ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో ప్రముఖ పోటీపరీక్షల సంస్థ అయిన సిల్వర్ జోన్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి జికె ఒలంపియాడ్లో పాఠశాలకు చెందిన పెరటి మయాంక్ రెడ్డి, 3 వ తరగతి, పి. ఇందు హాసిత, కె.హావిష్ రెడ్డి, 4వ తరగతి, మహ్మద్ జైన్ సిద్దిక్, 5వ తరగతి, జయంత్.వి., 7వ తరగతి మరియు జి.జోయల్ డెవిస్ 4వ తరగతి అత్యుత్తమ పోటీ ప్రదర్శనతో బంగారు పతకాలు గెల్చుకున్నారని మరియు రాష్ట్ర స్థాయిలో ఘనవిజయాలను సాధించడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు.
విజేతలకు పుష్పగుచ్చాలతో పాటు అర్హత పత్రాలను అందజేసి భవిష్యత్తులో నిర్వహింబబోయే మరిన్ని జాతీయ స్థాయి పరీక్షలలో విజయాలను నమోదు చేయాలని ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.