కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కమీషనరేట్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ గా పనిచేస్తూ, పదవీకాలం ముగిసిన నలుగురు ఏఎస్సై లు , 1)మొహమ్మద్ నూరుద్దీన్ స్పెషల్ బ్రాంచ్ 41 సంవత్సరాలు , 2) మొహమ్మద్ బషీరుద్దీన్ మానకొండూర్ పోలీస్ స్టేషన్ 40 సంవత్సరాలు ,3) సయ్యద్ మొయినుద్దీన్ ఆర్మ్డ్ రిజర్వు విభాగం 40 సంవత్సరాలు, 4) పి చంద్రా రెడ్డి హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నుండి 41 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పోలీసు శాఖకు సేవలందించి శనివారం నాడు పదవి విరమణ పొందారు. కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలు నందు ఈ కార్యకరం నిర్వహించారు. ఈ సందర్బంగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి మాట్లాడుతూ ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని వున్న పోలీస్ ఉద్యోగం సంపూర్ణంగా చేసి పదవి విరమణ పొందడమే గొప్ప విజయం అన్నారు. విరమణ పొందుతున్న అధికారులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న అధికారులకు కమీషనర్ గారి చేతుల మీదుగా పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. వారికి జ్ఞాపికలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ముని రామయ్య , రిజర్వు ఇన్స్పెక్టర్లు, శ్రీధర్ రెడ్డి (వెల్ఫేర్), సురేష్ (అడ్మిన్), కరీంనగర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్సై మామిడి సురేందర్, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.