అమరావతి, నిఘా న్యూస్: భారతదేశంలోనే మంగళ గిరి ప్రభుత్వ ఆసుపత్రిని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని, మంత్రి నారా లోకేశ్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి లో ఆదివారం అత్యాధునిక వసతులతో నిర్మించే 100 పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేశ్ మరో మంత్రి కందుల దుర్గేష్తో కలిసి భూమి పూజ చేశారు.ఆస్పత్రి నిర్మాణ నమూనా లను మంత్రులు పరిశీలిం చారు. గత ఎన్నికల సమయంలో మంగళగిరి వాసులకు అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చానని దానిని నెరవేర్చబోతున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. అన్ని రంగాలలో మంగళగిరి నియోజకవర్గా న్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపేంతవరకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీ మేరకు మంగళగిరి ప్రజలకు చిరకాల స్వప్నమైన 100 పడకల ఆస్పత్రికి మంత్రి లోకేశ్ నేడు భూమి పూజ చేశారు. అత్యాధునిక వసతులతో ఆస్పత్రిని కేవలం ఏడాది కాలంలోనే పూర్తిచేయను న్నారు.
సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే నెలలో టీడీపీ వ్యవస్థాపకు డు నందమూరి తారక రామారావు మంగళగిరిలో 30 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేశారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మనవడు లోకేశ్ 100 పడ కల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు.శంకుస్థాపన అనంతరం మంగళగిరి టిడ్కో నివాసాల వద్ద దివిస్ లేబరేటరీ ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి పథకా న్ని లోకేశ్ ప్రారంభించారు. ఇళ్ల పట్టాల రూపంలో వెయ్యి కోట్ల ఆస్తి పంపిణీ: మరోవైపు మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో చేపట్టిన ‘మన ఇల్లు – మన లోకేశ్’ తొలిదశ కార్యక్రమం నేటితో పూర్తవుతుంది.
దాదాపు 3 వేల మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ తొలిదశ కార్యక్రమాన్ని నేటితో పూర్తి చేయనున్నారు. ఇవాళ మొత్తంగా 832 మంది లబ్దిదారులు నారా లోకేశ్ చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టాలు అందుకో నున్నారు.నేటితో మొత్తం 3000 మంది లబ్ధిదారులకు ఇళ్లప ట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయనున్నారు. లబ్ధిదారులకు లోకేశ్ తన సొంత ఖర్చులతో బట్టలు, పసుపు కుంకుమ పెట్టి, భోజనాలు ఏర్పాటు చేసి ఉచితంగా పట్టాలు అందచేస్తున్నారు.
అధికారం చేపట్టిన ఏడాదిలోపే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా వెయ్యి కోట్ల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో పేదలకు పంపిణీ చేశామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి ప్రజలు తనకిచ్చిన మెజారిటీతో విమర్శకులకు సౌండ్ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.
ఎప్పుడూ మంగళగిరేనా రాష్ట్రం మొత్తం తిరగాలని చంద్రబాబు సూచించారని వెల్లడించారు. మంగళగిరి లో తన పరువు కాపాడి గౌరవం పెంచిన వారికే తన తొలి ప్రాధాన్యమని నాన్నకు చెప్పానన్నారు.