కరీంనగర్, నిఘా న్యూస్: నగరంలోని 18వ డివిజన్ రేకుర్తి లో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి ఫుడ్ కోర్టును కరీంనగర్ మాజీ మంత్రి,శాసనస భ్యులు గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ కోర్ట్ లోని వంటకాలను కొత్త తరహా వంటకాలను రుచి చూపించారు చాలా బాగా వంటలు ఉన్నాయని,ఇలానే నాణ్యతగా రుచిగా కస్టమర్లందరికీ అందించాలని వ్యాపారాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఈ సెంటర్ నిర్వాహకుడు రవీందర్ కు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, 18వ డివిజన్ మాజీ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణగౌడ్, 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, 18వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగుల ఏల్లయ్య నేరెళ్ల అజయ్ బోయిని అనిల్ రేగుల శ్రీనివాస్ జునెద్ తిరుపతి సత్యం హరీష్ శశి తదితరులు పాల్గొన్నారు.. పాల్గొన్నారు. అనంతరం వారాహి ఫుడ్ కోర్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిధులకు శాలువాతో సన్మానం చేసి పుష్ప గుచ్చాలు అందించారు.
ఫుడ్ కోర్టు ను ప్రారంభించిన మాజీ మంత్రి
RELATED ARTICLES