అమరావతి, నిఘాన్యూస్:విజయవాడ అంబాపూరం లోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఈరోజు సోదాలు చేపట్టారు.15 మందితో కూడిన ఏసీబీ బృందం ఈ ఉదయం 5 గంటలకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది.సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు జోగి రమేశ్ ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు.ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు సమాచారం. జోగి రమేశ్ ఇంట్లో సోదాల నేపథ్యంలో వైసీపీలో కలకలం రేగింది.
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
RELATED ARTICLES