విశాఖ,కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని నేతలు తిరిగి సొంతగూటికి?
అమరావతి, నిఘా న్యూస్:తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్పుడు ఆ పార్టీలో ఎంతో ఉన్నతస్థానం కల్పించినా, అధికారంపై ఆశ తో అటు వైపు వెళ్లినవారు మరికొంద రు… వైసీపీ ఘోర పరాజ యం తర్వాత ఇక ఆ పార్టీ లో ఉండటం వేస్ట్ అనుకుం టున్న వారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తామంటు న్నారు.తప్పు చేశాం.. సరిదిద్దుకునే చాన్స్ ఇవ్వండంటూ అధిష్టానానికి వర్తమానం..
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో…. గతంలో ఆ పార్టీలో చేరిన టీడీపీ మాజీ నేతలు మళ్లీ తెలుగుదేశం పార్టీ తలుపుతడుతున్నారట… తెలియక తప్పు చేశాం సరిదిద్దుకునే చాన్స్ ఇవ్వండంటూ అధిష్టానానికి వర్తమానం పంపుతున్నారని సమాచారం.
ఎలాగైనా టీడీపీలో తిరిగి చేరాలనుకుంటున్న వారిలో కొందరు.. తమకు రూట్ క్లియర్ అయిందని చెప్పు కుంటుండగా..మరికొందరు నేడో రేపో పసుపు కండువాలు కప్పుకోవడమే బ్యాలెన్స్ అని ప్రచారం చేస్తుండటం ఆయా నియోజకవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది