Sunday, August 3, 2025

మాజీ సీఎం జగన్ నేడు తిరుపతి పర్యటన?

అమరావతి, నిఘా న్యూస్:మాజీ సీఎం జగన్ తిరు మల పర్యటనకు ఈరోజు పయనం కానున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రేణిగుంటకు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుం టారని సమాచారం.ఈ నేపథ్యంలో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్ నెలకొంది. జగన్ పర్యటనను నిరసిస్తూ ఇప్పటికే అధికార కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ పర్యటనను అడ్డుకుం టామని కూటమి నేతలు చెప్పడంతో తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పలువురు కూటమినేతలు అలిపిరి.. చేరుకున్నారు.ఈనేపథ్యంలోనే జగన్ రేణిగుంట విమానాశ్ర యానికి వస్తుండటంతో ఎయిర్‌పోర్ట్‌లోనే జగన్‌ను నిలువరించేందుకు భద్రతా బలగాలు భారీగా మోహరిం చాయి. శాంతిభద్రతల పరి రక్షణలో భాగంగా వెనక్కి తిప్పి పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.పోలీసులు తిరుపతిలో శాంతి భద్రత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్న తరుణంలోనే సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు పోలీసులు…

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular