కరీంనగర్, నిఘా న్యూస్:. కరీంనగర్ కమిష సరేట్లో పాత కథ తిరిగి కొనసాగుతోంది. కొన్ని నెలల కిందట భూనేరాలకు పాల్పడిన వారంతా జైలు బాట పట్టారు. మళ్లీ కొన్ని నెలల విరామం తరువాత భూమోసాలపై కరీంనగర్ పోలీసులు నజర్ పెట్టారు. ఇటీవల పలువురిని అరెస్ట్ చేయడంతోపాటు ఇంకొందరిని అదుపు లోకి తీసుకునే దూకుడు పెంచుతున్నారు. కరీంనగర్ సీపీగా అభి షేక్ మహంతి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ఎక నామిక్ అఫెన్స్ వింగ్(ఈవోడ బ్ల్యూ) పేరిట ఆర్థిక నేరాలు, భూ సంబంధిత సమస్యలపై పిర్యాదులు స్వీకరించారు. ఏళ్లతరబడి ఆర్థికంగా, మాన సికంగా ఇబ్బందులు పడ్డవారంతా కమిషనరే టికు వరుస కట్టారు.గతేడాది మార్చి నుంచి ఏడాది చివరి నాటికి 3,121 పిర్యాదులు అందాయి. వీటన్నింటిపై దర్భా ప్తులు కొనసాగించి కొంతమంది కార్పొరేటర్లతో పాటు భూమోసాల్లో అరితేరిన వారిని ఆరెస్ట్ చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తిం బింది. తర్వాత కాస్త నెమ్మదించినా మళ్లీ ఇటీవల వరుసగా పాత దరఖాస్తులపై సీపీ నజర్ పెట్టారు.
నిబంధనలకు విరుద్ధంగా భూ ఆక్రమణదా రులకు సహకరించిన అధికారులను ఉపేక్షిం చడం లేదు. ఇప్పటికే పోలీసు శాఖలోని పలువురిని విచారించి వారిపై క్రమశిక్షణ ఉద్యోగుల పాత్ర ఉన్నవారిపైన కేసులు కట్టారు. తాజాగా మరోనాలుగైదు కేసుల్లో కీలకంగా ఉన్న రెవెన్యూ అధికారులను రేపో మాపో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తు న్నట్లు సమాచారం.దాదాపు రెండు దశాబ్దాల నుంచి జిల్లాలో పనిచేసి వివిధ ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ, ఉన్నతాధికారుల్లోనూ ఈ కేసుల విచారణ తీరుతో గుబులు పట్టుకుంది. గతంలో తహసీల్దార్లుగా మోసాలు ఉన్న వారికి ఈ నేరాలతో సంబంధముందనే కోణం లోనే విచారణ చేపడుతున్నారు.
గతంలో కస్టడీకి నిందితులను విచారిం చిన క్రమంలో పలువురు అధికారుల పాత్రలు బయటపడ్డాయి. ఇదే తరహాలో కొండరు రాజ కీయ నాయకులతోపాటు అప్పటి రెవెన్యూ అధి కారుల పేర్లు తాజాగా విచారణ జరుపుతున్న కేసుల్లో వినిపిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా కరీంనగర్ కలెక్టరేట్లో కీలక హోదాల్లో ఉన్న వారి పేర్లు త్వరలోనే బహిర్ణ తమవుతాయని.. కీలకమైన పత్రాల సృష్టిలో వారి సహకారం ఉందనే విషయమై పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ దందాలో రెవెన్యూ, మున్సిపల్ అండ్ పోలీస్ అధికారులు అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని తెలుస్తోంది.గత సిపి మహంతి ఎంక్వయిరీ లో దాని గురించి చర్యలు తీసుకుంటారని చర్చ జరిగింది. అయితే ఆయన ట్రాన్స్ఫర్ కావడంతో ప్రస్తుత సిపి గారు ఆ వింగ్ను కొనసాగిస్తారని స్టేట్మెంట్ చేశారు. ఆ వింగు పరిస్థితి ఏంటి ?దానికి ఎవరు ఇన్చార్జి ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది.