కరీంనగర్, నిఘా న్యూస్:రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ కు విచ్చేసిన సీ.ఐ.ఎస్.ఎఫ్ బలగాలతో సోమవారంనాడు వన్ టౌన్ పోలీసు స్టేషన్ ల పరిధిలో, గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా గుర్తించిన పలు సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ ఫ్లాగ్ మార్చ్ కరీంనగర్ బైపాస్ వద్ద ప్రారంభమై కోతిరాంపూర్, మైసూర్ బేకరీ, గణేష్ నగర్, అంబేద్కర్ స్టేడియం మీదుగా భగత్ నగర్, పెద్దమ్మతల్లి గుడి వద్ద ముగిసింది. ఈ ఫ్లాగ్ మార్చ్ నందు సీ.ఐ.ఎస్.ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు మరియు స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీ.ఐ.ఎస్.ఎఫ్ సేవలు వినియోగించనున్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ , కంపెనీ కమాండంట్ విక్రాంత్, అసిస్టెంట్ కమాండంట్ విజేందర్, ఇన్స్పెక్టర్ లు సరిలాల్ (వన్ టౌన్) రమేష్ (టూ టౌన్) ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్..
RELATED ARTICLES