చొప్పదండి నియోజకవర్గం లోని ఆలయాల అభివృద్ధికి సహకారం అందజేస్తాం
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, నిఘా న్యూస్: సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయని,తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం ఉప్పరమల్యాలలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ( శీతల దేవి) ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తుల ఘన స్వాగతం పలికి శాలవాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూచొప్పదండి నియోజకవర్గం లోని ఆలయాల అభివృద్ధికి సహకారం అందజేస్తామని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుఖసంతోషాలతో జీవించాలని పోచమ్మ తల్లికి పూజలు చేసినట్లు తెలిపారు.నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గంగాధర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, గంగాధర మార్కెట్ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, గంగాధర్ సింగ్ వైస్ చైర్మన్ వేముల భాస్కర్,రుద్ర మల్లేషం, పెంచాల చందు,కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ,కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట సంధ్యా, దోర్నాల శ్రీనివాసరెడ్డి, వోడ్నల యగ్నేష్, అట్లా శేఖర్ రెడ్డి, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి,మేర్జ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.


