కరీంనగర్, నిఘా న్యూస్: పాఠశాల విద్య మధురానుభూతులను మిగులుస్తాయని మరియు చాలా కీలకంగా వ్యవహరిస్తూన్నాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి.నరేందర్ రెడ్డి గారు స్థానిక దేశారాజ్పల్లిలోని ఒక ప్రైవేట్ వేడుక మందిరంలో ఆల్ఫోర్స్ హై స్కూల్ (సిబిఎస్ ఈ) మరియు అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ (స్టేట్ బోర్డ్) – కొత్తపల్లి 10వ తరగతి విద్యార్ధుల వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు చదువుల తల్లి సరస్వతిమాత విగ్రహానికి పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను చక్కగా పాటించాలని మరియు లక్ష్యాలు సాధించే విదంగా శ్రమించాలని వారు చెప్పారు. తరగతి గదుల్లో భోదించిన విషయాలు విద్యార్థుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతుందని మరియు వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. 10వతరగతిలో అత్యుత్తమ మార్కులను సాధించి విద్యార్థి జీవితంలో పొందేటువంటి మొట్టమొదటి పట్టాను చాలా ప్రశంసనీయంగా చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు నిర్దేశించినటువంటి ఆశయాలను సరియైన క్రమంలో పయనించి వాటిని సాధించే దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. ఎంతో మంది మహానుబావులు వారి ఉపాధ్యాయుల మార్గాలను పాటించి, అవలంబించిన విధానాలను చాలా బాగా అమలుపర్చి ఉత్తమంగా ఉండాలని చెప్పారు.
విద్యార్థులకు పాఠశాలలో చదువుకున్న రోజులు చాలా మధుర జ్ఞాపకాలను మిగిలుస్తాయని వారు చెప్పారు. ప్రత్యేకంగా విద్యార్థులకు లక్ష్యాలను సాధించే విదానాలను సమగ్రంగా సముచితంగా తెలియపర్చాలని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి చాలా సవాళ్ళతో కూడుకున్నదని, అంతటి సవాళ్ళను సులభంగా ఎదురకునేటట్టు సందేశాలను ఇస్తున్నామని ప్రత్యేకంగా విద్యార్థులకు వినోదాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ పారితోషికాలను అందజేస్తున్నామని వారు చెప్పారు.
విద్యార్థులకు విద్యతో పాటు మధురానుబూతిని కల్పించటానికై మరియు ఉత్తమంగా సలహాలను కల్పించటానికై నేడు సాంస్కృతిక కార్యక్రమాన్ని మెమోరీన్ అనే పేరుతో సాంస్కృతిక కార్యక్రమాన్ని వీడ్కోలు వేడుక రూపంలో నిర్వహించడం అనవాయితీ అని చెప్పారు.
వేడుకలలో భాగంగా విద్యార్థులు ఉత్తమంగా విద్యను అందించినందుకు మరియు ఎప్పటికప్పుడు మార్గదర్శకం చేసిన విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి గారిని మరియు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడంతో పాటు జ్ఞాపికలను ప్రధానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించినటువంటి రామ్సియరామ్, ఓష్నోరహ, కొమ్మా ఊయాల, స్నేహమేరా శాశ్వతం, చిన్ని చిన్ని ఆశ నృత్యాలు చాలా ఆకర్షనీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.