కరీంనగర్, నిఘా న్యూస్:నకిలీ ధృవపత్రాలు సృష్టించి, ఇదివరకే విక్రయించిన భూమిని తిరిగి ఆక్రమించినందుకు అరెస్ట్ అయి జైలులో ఉన్న నిందితులిద్దరైన మూల తిరుమల రెడ్డి , లంక శేఖర్ లను కోర్ట్ ద్వారా 24 గంటల పోలీస్ కస్టడీకి తీసుకున్న రూరల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్ వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యూమెంట్లను స్వాధీన పరుచుకున్నారు.నకిలీ ధృవపత్రాలు సృష్టించి, ఇదివరకే విక్రయించిన భూమిని తిరిగి ఆక్రమించినందుకు గాను బాధితుడు కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన తెల్ల రాజయ్య (54), తండ్రి బక్కయ్య, పవర్ లూమ్ నందు కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కరీంనగర్ రూరల్ పోలీసులు, నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అందులో ఇద్దరిని A1,A2 గా ఉన్న కరీంనగర్ తీగలగుట్టపల్లి కి చెందిన మూల తిరుమలరెడ్డి (53), కరీంనగర్ విద్యారణ్యపురి కాలనీ రోడ్ నం . 03 కి చెందిన లంక శేఖర్(52) లను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచగా కేసును పరిశీలించిన గౌరవ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించగా, కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్ నిందితులిద్దరినీ కరీంనగర్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే కేసుకు సంబందించిన మరింత సమాచారం సేకరించేందుకుగాను నిందితులిద్దరని కోర్టు అనుమతి ద్వారా పోలీస్ కస్టడీకి తీసుకున్న రూరల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్ శుక్రవారంనాడు వారి ఇళ్లల్లో సోదాలు జరిపి కేసుకు సంబందించిన పలు కీలక డాక్యూమెంట్లను స్వాధీన పరుచుకున్నారు.
నకిలీ ధృవపత్రాల కేసు: కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..
RELATED ARTICLES