Friday, March 6, 2026

తల దువ్వినందుకు గుండు కొట్టించిన ఎస్సై

నాగర్ కర్నూల్, నిఘా న్యూస్:నాగర్ కర్నూల్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. లింగాల పోలీస్ స్టేషన్‌లో యువ కులు గుండు కొట్టించడం కలకలం రేపుతోంది.ఓ పెట్రోల్ బంక్ గొడవ విషయంలో స్టేషన్లకు పిలిపించి,ముగ్గురు యువకులను విచారి స్తుండగా సతీష్ అనే యువకుడు తల దువ్వుకున్నాడు.దీంతో ఎస్సై ఆగ్రహంతో ఊగిపోయాడు. నా ముందే తల దువ్వుకుంటావా? అని సతీష్ అనే యువకుని తో పాటు మరో ఇద్దరు యువకులకు గుండు కొట్టించి ఇంటికి పంపించేశాడు.ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు తన ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటన లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని ఓ పెట్రోలు బంకు వద్ద యువకులకు, సిబ్బంది మధ్య పెట్రోల్ విషయంలో గొడవ జరిగిందని విశ్వసనీయ సమాచారం.పెట్రోలు బంకు నిర్వాహ కుల ఫిర్యాదు మేరకు యువకులను పీఎస్‌కు తరలించారు. ముగ్గురు యువకుల్లో ఒకరు ఎస్సై ని ప్రశ్నించారు. దీంతో ఎస్సీ జగన్ ముగ్గురు యువకు లకు గుండు చేయించాడు.మరుసటి రోజు ఓ యువ కుడు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ సంఘటన పోలీస్ డిపార్ట్మెంట్ లోను కలకలం రేపుతుంది,సంఘటనపై పోలీసు ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular