రాజన్న సిరిసిల్ల జిల్లా ఆగస్టు 17(నిఘ న్యూస్) ఎల్లారెడ్డిపేట మండలంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు, దాడులకు నిరసనగా ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్లారెడ్డిపేట మండలం బంద్ సంపూర్ణమైంది.
మండల ప్రజలు, వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు అందరూ స్వచ్ఛందంగా బంద్ ని పాటించారు.
ఈ సందర్బంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులు మాట్లాడుతూ..
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్ కు స్వచ్ఛందంగా మద్ధతు తెలిపిన బంద్ లో పాల్గొన్న ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరికీ, వ్యాపార వాణిజ్య విద్యాసంస్థలకు ధన్యవాదాలు తెలియజేసారు, హిందువులందరూ ఐక్యంగా ఉండి హిందువుల పైన ఎలాంటి దాడి జరిగిన వారి కోసం అండగా ఉంటూ… మన ధర్మాన్ని సంప్రదాయలు కాపాడుకోవాలని ప్రపంచానికే హిందూ సనాతన ధర్మం ఆదర్శం అలాంటి ధర్మాన్ని మనం అందరం కాపాడుకోవడం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరం జాగృతం అవ్వాలని పిలుపునిచ్చారు.
ఎల్లారెడ్డిపేట బంద్ విజయవంతం…
RELATED ARTICLES


