Friday, March 6, 2026

చొప్పదండి నియోజకవర్గం లో విద్యాభివృద్ధికి కృషి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, నిఘా న్యూస్:గంగాధర లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వినతి పత్రం సమర్పించారు.చొప్పదండి నియోజకవర్గం లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.గంగాధర మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభించేలా చూడాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించినట్టు ఆయన తెలిపారు.ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కళాశాలను చదువుకోవడానికి గంగాధర తో పాటు చుట్టూ ప్రక్కల మండలాల విద్యార్థులు కరీంనగర్, జగిత్యాల పట్టణాలకు వెళ్లవలసి వస్తోందని, పేద మధ్యతరగతి విద్యార్థులు ఖర్చులు భరించలేక చదువును మధ్యలోనే నిలిపివేస్తున్న విషయాన్ని గతంలో తాము గుర్తించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

గంగాధర లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే గంగాధర తో పాటు, చుట్టూప్రక్కల మండలాల విద్యార్థులకు డిగ్రీ విద్యను అభ్యసించడానికి సులువవుతుందని మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసినట్టు తెలిపారు.ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించినట్టు తెలిపారు.

ఈ మేరకు మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి తరగతులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.

మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సత్యం కృతజ్ఞతలు తెలిపారు.

చొప్పదండి నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్న గంగాధర

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular